'ఏటీపీ ఫైనల్స్' ప్రపంచ టూర్ టోర్నీలో రష్యన్ ఆటగాడు డేనియల్ మెద్వదేవ్ విజేతగా నిలిచాడు. లండన్‌లో ఆదివారం రాత్రి జరిగిన పోరులో డొమినిక్ థీమ్‌పై 4-6, 7-6(2), 6-4 తేడాతో గెలిచి.. కెరీర్లో తొలి 'ఏటీపీ ఫైనల్' ట్రోఫీని దక్కించుకున్నాడు.
తొలి, మలి విజేతలు రష్యా వాళ్లే!
ఏటీపీ ప్రపంచ టూర్ ఫైనల్స్‌ను 2009 నుంచి లండన్‌లోనే నిర్వహిస్తున్నారు. తొలిసారి రష్యా ప్లేయర్ నికోలాయ్ డేవిడెన్కో విజేతగా నిలిచాడు. ఇప్పుడు డేనియల్ మెద్వదేవ్ గెలుపొందడం విశేషం. "ఏటీపీ ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీను లండన్ వేదికగా ప్రారంభించి 12 ఏళ్లయింది. ఇందులో తొలి, చివరి విజేతలుగా రష్యాకు చెందినవారే! తనలాంటి ఎంతోమంది ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన నికోలాయ్ డేవిడెన్కేకు ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని ట్రోఫీ గెలిచిన అనంతరం మెద్వదేవ్ చెప్పాడు.
వరుసగా రెండోసారి ఓటమి
ఏటీపీ ఫైనల్స్‌లో గెలిచిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా నిలిచేందుకు డొమినిక్ థీమ్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ టోర్నీలో అతనికిది వరుసగా రెండో పరాజయం. గత సీజన్లో సిట్సిపాస్ చేతిలో ఓడిపోయాడు.