తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియన్ ఓపెన్: నాలుగో రౌండ్​కు జకోవిచ్, థీమ్ - డొమినిక్ థీమ్​

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో స్టార్​లు నొవాక్ జకోవిచ్, డొమినిక్ థీమ్​ నాలుగో రౌండ్​కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్​లో సిమోనా హాలెప్ మూడో రౌండ్​లో విజయం సాధించింది.

Australian Open: Djokovic through to fourth round after hard-fought win over Fritz
ఆస్ట్రేలియన్ ఓపెన్: నాలుగో రౌండ్​కు జకోవిచ్, థీమ్

By

Published : Feb 13, 2021, 5:28 AM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ నాలుగో రౌండ్​కు దూసుకెళ్లాడు. హోరాహోరీగా సాగిన పోరులో టేలర్ ఫ్రిట్జ్​పై 7-6, 6-4, 3-6, 4-6, 6-2 తేడాతో శ్రమపడి గెలుపొందాడు.

తొలి రెండు సెట్లలో ఓడిన ఫ్రిట్జ్​.. అనూహ్యంగా పుంజుకొని 3, 4 సెట్లను కైవసం చేసుకున్నాడు. అయితే చివరి సెట్​లో నెగ్గి జకో.. రౌండ్​లో విజయం సాధించాడు.

మరోవైపు ఆస్ట్రేలియా ప్లేయర్ డొమినిక్ థీమ్​.. మూడో రౌండ్​లో నిక్​ కిర్గియోస్​పై విజయం సాధించాడు. 4-6, 4-6, 6-3, 6-4, 6-4 తేడాతో గెలుపొందాడు.

మహిళల సింగిల్స్​లో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హాలెప్ నాలుగో రౌండ్​ చేరింది. వెరోనికాపై 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది.

ఇదీ చూడండి:ఆస్ట్రేలియన్ ఓపెన్: నాలుగో రౌండ్​కు సెరెనా

ABOUT THE AUTHOR

...view details