తెలంగాణ

telangana

ETV Bharat / sports

Australian open 2021: సానియా, బోపన్న జోడీలు ముందంజ - బోపన్నా రామ్​కుమార్​

Sania Mirza Australian open 2022: ఆస్ట్రేలియన్​ ఓపెన్‌ సన్నాహక టోర్నీల్లో సానియా మీర్జా, రోహన్‌ బోపన్నలు తమ భాగస్వాములతో కలిసి శుభారంభం చేశారు. డబ్ల్యూటీఏ 500 ఈవెంట్‌ మహిళల డబుల్స్‌ తొలి రౌండ్​లో సానియా-నడియా కిచెనోక్‌ జోడీ 1-6, 6-3, 10-8తో గెలవగా.. ఏటీపీ 250 టోర్నమెంట్​ పురుషుల డబుల్స్‌లో తొలి రౌండ్​లో రోహన్‌ బోపన్న-రామ్‌కుమార్‌ రామనాథన్‌ 6-2, 6-1తో విజయం సాధించారు.

Sania Mirza Australian open 2021
Sania Mirza Australian open 2021, సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్​ 2021

By

Published : Jan 5, 2022, 6:29 AM IST

Sania Mirza Australian open 2022: ఆస్ట్రేలియన్​ ఓపెన్‌ సన్నాహక టోర్నీల్లో సానియా మీర్జా, రోహన్‌ బోపన్న తమ భాగస్వాములతో కలిసి ముందంజ వేశారు. అడిలైడ్‌లో జరుగుతున్న డబ్ల్యూటీఏ 500 ఈవెంట్‌ మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో సానియా-నడియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌) జోడీ 1-6, 6-3, 10-8తో రెండో సీడ్‌ గాబ్రియెలా దబ్రౌస్కీ-గిలీనా జంటపై విజయం సాధించింది. తొలి సెట్‌ కోల్పోయినా పోరాడిన సానియా జంట.. రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. హోరాహోరీగా సాగిన మూడో సెట్లో ఒత్తిడిని తట్టుకుంటూ వరుసగా రెండు పాయింట్లు సాధించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది.

ఇదే వేదికలో జరుగుతున్న ఏటీపీ 250 టోర్నమెంట్లో పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న-రామ్‌కుమార్‌ రామనాథన్‌ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో భారత జంట 6-2, 6-1తో జేమీ సెరెటనీ (అమెరికా)-ఫెర్నాండో రొంబొలీ (బ్రెజిల్‌) ద్వయంపై విజయం సాధించింది. ఏటీపీ టూర్‌లో జత కట్టడం బోపన్న-రామ్‌కుమార్‌లకు ఇదే తొలిసారి. మరోవైపు అడిలైడ్‌ టోర్నీ సింగిల్స్‌ క్వాలిఫయర్స్‌ తొలి రౌండ్లో రామ్‌కుమార్‌ రామనాథన్‌ 4-6, 6-7 (7)తో హొల్గర్‌ రూన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు.

ఇదీ చూడండి:కోర్నికోవా.. ఈ టెన్నిస్ భామ యమ హాట్ గురూ!

ABOUT THE AUTHOR

...view details