తాజా టెన్నిస్ ర్యాంకింగ్స్లో నోవాక్ జకోవిచ్ అగ్రస్థానాన్ని మరింత పదిలపరచుకున్నాడు. 11,160 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. సోమవారం ప్రకటించిన ఏటీపీ (అసోసియేషన్ టెన్నిస్ ప్రొఫెషనల్స్) ర్యాంకింగ్స్లో రఫెల్ నదాల్ రెండో స్థానంలో ఉన్నాడు.
స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 5,590 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా... డొమినిక్ థీమ్ ఐదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.
గత మూడు గ్రాండ్ స్లామ్ల్లో విజేతగా నిలిచిన జకో... నదాల్ కంటే 3 వేల పాయింట్లు ముందున్నాడు. రఫా 8,085 పాయింట్లు సాధించాడు. గత మ్యాచ్లో నదాల్పై గెలిచిన ఇటాలియన్ ఆటగాడు ఫాబియో కెరీర్ ఉత్తమం 12వ స్థానానికి ఎగబాకాడు.
టాప్ 5 టెన్నిస్ ఆటగాళ్లు..
- నోవాక్ జకోవిచ్(సెర్బియా).........11, 160 పాయింట్లు
- రఫెల్ నదాల్(స్పెయిన్)........... 8, 085
- అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ)..... 5, 770
- రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్)... 5, 590
- డొమినిక్ థీమ్(ఆస్ట్రియా)..... 4, 675