టీ20 ప్రపంచకప్-2021(t20 world cup 2021)లో టాస్‌దే ఆధిపత్యం. యూఏఈ పిచ్‌లు మ్యాచ్ జరుగుతున్న కొద్ది మార్పులకు లోనవ్వడం, రాత్రి పూట మంచు ప్రభావం వల్ల బౌలర్లకు బంతిపై పట్టుదొరక్కపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ టోర్నీలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలిచాయి. దీంతో టాస్ గెలిస్తే చాలు ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపిస్తున్నాయి జట్లు. నేడు (నవంబర్ 14) ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే ఫైనల్(aus vs nz t20 final) మ్యాచ్‌లోనూ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టాస్(t20 world cup 2021 toss results) ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూద్దాం.
T20 World Cup 2021: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా? - ఆస్ట్రేలియా-న్యూజిలాండ్
ప్రస్తుత టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో టాస్ కీలకపాత్ర పోషిస్తోంది. యూఏఈ పిచ్‌ల్లో రాత్రి పూట మంచు ప్రభావమే అందుకు కారణం. అందుకే టాస్(t20 world cup 2021 toss results) గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కెప్టెన్లు. నేడు (నవంబర్ 14) ఫైనల్(aus vs nz t20 final) పోరు నేపథ్యంలో ఈ టోర్నీలో టాస్ ప్రభావంపై ఓ లుక్కేద్దాం.
T20 World cup
టాస్ కీలకం
- ఫైనల్ జరిగే దుబాయ్‌లో ఈ ప్రపంచకప్‌లో సూపర్ 12 దశ నుంచి జరిగిన 12 మ్యాచ్‌లకు గానూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 11 సార్లు గెలిచాయి.
- ఇందులో రాత్రిపూట జరిగిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ ఛేదన చేసిన జట్లే నెగ్గాయి.
- దుబాయ్‌లో జరిగిన గత 17 టీ20 మ్యాచ్‌ల్లో 16 సార్లు రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్లదే పైచేయి.
- ఈ టోర్నీలో ఆసీస్‌కు దక్కిన ఐదు విజయాలు ఛేదనలోనే సొంతమయ్యాయి.
టాస్ గణాంకాలు ఇవి
- 29- టాస్ గెలుపు & మ్యాచ్ గెలుపు
- 15- టాస్ ఓటమి & మ్యాచ్ గెలుపు
- 13- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నవారు
- 31- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నవారు
- 28- మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసి విజయం అందుకున్న మ్యాచ్‌లు
- 16- మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి విజయం అందుకున్న మ్యాచ్‌లు