దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న (T20 World Cup 2021) టీ20 ప్రపంచకప్ 2021.. ఆఖరి ఘట్టానికి చేరుకుంది. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను దక్కించుకునేందుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ (Aus vs NZ Final) హోరాహోరీకి సిద్ధమయ్యాయి. ఎవరు గెలిచినా చరిత్రే. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
టోర్నీ ఆరంభమైన 2007లోనే.. తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని నాటి టీమ్ఇండియా. ఇప్పటివరకు ఆరుసార్లు పొట్టి ప్రపంచకప్ జరగ్గా.. వెస్టిండీస్ మాత్రమే రెండుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏయే జట్టు ఎప్పుడెప్పుడు ఎలా ఈ టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిందో తెలుసుకుందాం.
2007 టీ20 ప్రపంచకప్: ఇండియా-పాకిస్థాన్
దక్షిణాఫ్రికా వేదికగా తొలి టీ20 ప్రపంచకప్ (Ind vs Pak) ఫైనల్లో టీమ్ఇండియా, దాయాదీ పాకిస్థాన్ తలపడ్డాయి. గౌతమ్ గంభీర్ 75 పరుగులు చేయడం వల్ల 157 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు నిలిపింది భారత జట్టు. అనంతరం దాయాదీని ఇర్ఫాన్ పఠాన్ (3/16) కట్టడి చేశాడు. దీంతో 5 పరుగుల తేడాతో గెలిచిన నాటి ధోనీ సేన.. తొలి టీ20 ప్రపంచకప్‌ను (T20 World Cup 2007 Winner) ముద్దాడింది.
2009 టీ20 ప్రపంచకప్: పాకిస్థాన్-శ్రీలంక
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన రెండో టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2009) తుది పోరులో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది పాక్. తొలి పొట్టి వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు.. ఈ టోర్నీలో కసితీరా ఆడి టైటిల్‌ను (T20 World Cup 2009 Winner) కైవసం చేసుకుంది.
2010 టీ20 ప్రపంచకప్: ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా
వెస్టిండీస్ వేదికగా 2010 టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2010) ఫైనల్లో ఆస్ట్రేలియాపై 7 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది ఇంగ్లాండ్ (T20 World Cup 2010 Winner). కెవిన్ పీటర్సన్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
2012 టీ20 ప్రపంచకప్: వెస్టిండీస్-శ్రీలంక
శ్రీలంక వేదికగా జరిగిన ఈ టోర్నీలో (2012 ICC World Twenty20) వెస్టిండీస్ తొలిసారి ఫైనల్ చేరి కప్పు గెలిచింది (2012 ICC World Twenty20 Winner). 138 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో లంక బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 2009 టీ20 ప్రపంచకప్ ఓడిన ఆ జట్టుకు మరోసారి నిరాశ తప్పలేదు. అజంతా మెండిస్ (15 వికెట్లు) టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీశాడు.