ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner News).. తన బ్యాటింగ్ ఫామ్‌పై (David Warner Form) వ్యక్తమవుతున్న ఆందోళనలను నవ్వుతూ కొట్టిపారేశాడు. టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై (AUS VS SA) ఆసీస్ గెలిచినా.. అందులో వార్నర్ సత్తా చూపలేదు. ఐపీఎల్ సహా వార్మప్ మ్యాచుల్లో గత 5 టీ20 ఇన్నింగ్స్‌ల్లో అతడు చేసింది 0, 2, 0, 1, 14 పరుగులే. దీంతో తదుపరి శ్రీలంకతో (AUS VS SL) మ్యాచ్ నేపథ్యంలో వార్నర్ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. దీనిపై స్పందించిన వార్నర్.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని అంటున్నాడు.
"నా ఫామ్ గురించి మాట్లాడటం చూస్తుంటే నవ్వొస్తోంది. ఎందుకంటే కొంత కాలంగా నేను క్రికెట్ ఆడిందే లేదు. ఐపీఎల్‌లోనూ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. ఆ తర్వాత యువకులను సూచనలు ఇస్తూ ఉన్నాను."