తొలుత పాకిస్థాన్‌తో (IND VS PAK) ఓడింది.. వారం రోజుల సమయం వచ్చింది.. అయినా తీరు మారలేదు.. న్యూజిలాండ్‌తోనూ (IND VS NZ) ఘోర పరాభవమే. దీంతో టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) టీమ్ఇండియా ప్రదర్శనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కివీస్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మను కాదని ఇషాన్ కిషన్‌ను (Ishan Kishan News) ఓపెనింగ్ పంపించడం, సూర్యకుమార్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం వంటి నిర్ణయాలపైనా విమర్శలు వచ్చాయి. అయితే బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై (Team India Batting Order) టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్స్పందించారు. ఇషాన్‌ను ఓపెనర్‌గా పంపించాలనే మేనేజ్‌మెంట్ నిర్ణయానికి రోహిత్ శర్మ మద్దతు తెలిపాడని స్పష్టం చేశారు.
"కివీస్‌తో మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి సూర్యకుమార్ యాదవ్ స్వల్ప వెన్నునొప్పితో బాధపడ్డాడు. మైదానంలోకి దిగేందుకు ఫిట్ లేడు. అందుకే మ్యాచ్‌లోకి తీసుకోలేకపోయాం. ఇషాన్ విషయంలో మా నిర్ణయం తప్పు లేదనిపిస్తోంది. గతంలోనూ ఓపెనర్‌గా ఇషాన్ రాణించాడు. మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయానికి రోహిత్ కూడా మద్దతు తెలిపాడు. దీనిపై జరిగిన చర్చలోనూ (Rohit Sharma News) రోహిత్ భాగమే. ఇషాన్‌ను ముందుకు తీసుకురావడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ శైలి. మిడిలార్డర్‌లో పంత్, జడేజా, ఇషాన్ ముగ్గురూ లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారు. అందుకే ఇషాన్‌ను ఓపెనింగ్ తీసుకొస్తే సమతుల్యత వస్తుందని భావించాం"
-విక్రమ్ రాఠోడ్, టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్