తెలంగాణ

telangana

ETV Bharat / sports

షూటింగ్​ ప్రపంచకప్​లో భారత్​కు మూడో స్వర్ణం - షూటింగ్ ప్రపంచకప్​ టోర్నీ

బ్రెజిల్‌ వేదికగా జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్​ టోర్నీలో భారత్​కు​ మూడో స్వర్ణం  దక్కింది. ఈ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్​ యశస్విని సింగ్‌ గోల్డ్ సాధించింది.

భారత షూటర్​ యశస్విని సింగ్‌

By

Published : Sep 1, 2019, 12:01 PM IST

Updated : Sep 29, 2019, 1:31 AM IST

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్​లో యశస్విని సింగ్​(భారత్​), ఒలింపిక్ విన్నర్ ఒలేనా కోస్టెవిచ్‌(ఉక్రెయిన్​)ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. 22 ఏళ్ల ఈ అమ్మాయి 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్​ విభాగంలో 236.7 పాయింట్ల స్కోరుతో విజేతగా నిలిచింది. ఈ విజయంతో షూటింగ్​లో టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది యశస్విని.

ఈ టోర్నీలో మాజీ ఒలింపిక్ విజేత, ప్రపంచ నెం.1 షూటర్​ కోస్టెవిచ్ 234.8 పాయింట్లతో రజతం అందుకోగా.. జాస్మినా మిలోవనోవిక్(సెర్బియా) తర్వాత స్థానంలో నిలిచింది.

ఇప్పటికే షూటింగ్​లో అభిషేక్​ వర్మ, ఎలెవెనిల్ వలరివన్​ స్వర్ణాలు సాధించారు.

ఇప్పటి వరకు 2020 టోక్యో ఒలింపిక్స్​​కు యశస్విని, సంజీవ్ రాజ్‌పుత్, అంజుమ్ మౌద్గిల్, అపూర్వి చందేలా, సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, దివ్యాన్ష్ సింగ్ పన్వర్, రాహి సర్నోబాట్, మను బాకర్​ అర్హత సాధించారు.

ఇదీ చూడండి: 'ఈ శతకం చూసి మా నాన్న గర్విస్తుంటారు'

Last Updated : Sep 29, 2019, 1:31 AM IST

ABOUT THE AUTHOR

...view details