తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియన్​ క్వాలిఫయింగ్​ పోటీల్లో భారత రెజ్లర్ల ఓటమి - సుశీల్​ కుమార్​

ఆసియన్​ క్వాలిఫయింగ్​ రెజ్లింగ్ పోటీల్లో భారత రెజ్లర్లు సందీప్ సింగ్ మన్, సుమిత్ మాలిక్, సత్యవర్త్​ ఓటమి పాలయ్యారు. సందీప్ ఓటమితో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్​ కుమార్​ టోక్యో బెర్త్​ ఆశలు సజీవంగా ఉన్నాయి.

Wrestling: Sandeep, Sumit, Satyawart miss out on Olympic quotas at Asian qualifying event
ఆసియన్​ క్వాలిఫయింగ్​ పోటీల్లో భారత రెజ్లర్ల ఓటమి

By

Published : Apr 11, 2021, 10:13 PM IST

కజకిస్థాన్​లో జరిగిన ఆసియన్​ క్వాలిఫయింగ్ ఈవెంట్​లో భారత పురుష రెజ్లర్లకు పరాభవం ఎదురైంది. జాతీయ ఛాంపియన్ సందీప్ సింగ్​మన్​(74 కేజీ)తో పాటు సుమిత్​ మాలిక్​(125 కేజీ), సత్యవర్త్​ కడియన్​(97 కేజీ).. పోటీల్లో ఓడి, టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయారు.

సెమీఫైనల్లో ఇరాన్​ రెజ్లర్ యోనెస్​ అలీ అక్బర్​ చేతిలో సందీప్​ సింగ్​.. ఇరాన్ కుస్తీ పోటీదారుడు ఆస్కారి మహమ్మదియన్​ చేతిలో​ సత్యవర్త్ సెమీస్​లో ఓటమి పాలయ్యాడు. సందీప్ ఓటమితో వెటరన్​ రెజ్లర్​ సుశీల్​ కుమార్​ ఒలింపిక్స్​ ఆశలు సజీవంగా ఉన్నాయి. టోక్యో బెర్త్​ దక్కించుకునే అవకాశం అతడికి మెండుగా ఉంది.

వీరందరికీ మే 6 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ క్వాలిఫయర్స్​ పోటీల ద్వారా మరో అవకాశం దక్కనుంది.

ఇదీ చదవండి:ఒలింపిక్స్​కు మరో ఇద్దరు మహిళా రెజర్లు అర్హత

ABOUT THE AUTHOR

...view details