ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుశీల్.. గత 15 రోజులుగా పరారీలో ఉండగా, జలంధర్ సమీపంలో అరెస్టయ్యాడు.
హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్టు - Sushil Kumar latest news
హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల సుశీల్ ముందస్తు బెయిల్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.
సుశీల్ కుమార్
ఈనెల 4న ఛత్రసాల్ స్టేడియం వద్ద రెండు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన కొట్లాటలో సాగర్ అనే 23 ఏళ్ల రెజ్లర్ మరణించాడు. సుశీల్ కుమార్ దాడి వల్లే సాగర్ చనిపోయాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు సుశీల్‌కుమార్ ముందస్తు బెయిలు దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.