కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల ఇంటికే పరిమితమయ్యారు పలువురు ఆటగాళ్లు. ఈ ఖాళీ సమయంలో తమకిష్టమైన వ్యాపకాలతో గడుపుతున్నారు. తమలో ప్రతిభను బయటపెడుతున్నారు. ఇదే తరహాలో ఓ హరియాణా పాటకు డ్యాన్స్ చేశాడు భారత రెజ్లర్ భజరంగ్ పునియా. ఈ వీడియోను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ట్వీట్ చేసింది.
పాపులర్ సాంగ్‌కు భారత రెజ్లర్ భలే డ్యాన్స్ - భారత రెజ్లర్ భజరంగ్ పునియా డ్యాన్స్
భారత రెజ్లర్ భజరంగ్ పునియా నృత్యంతో అలరించాడు. ఆ వీడియోను ట్వీట్ చేసింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్.
భారత రెజ్లర్ భజరంగ్ పునియా
కరోనా కట్టడిలో భాగంగా జరుగుతున్న పోరాటానికి ఇప్పటికే తన ఆరు నెలల జీతం విరాళంగా ప్రకటించాడు భజరంగ్. 2019లో రెజ్లింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఇతడు.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అయితే ఈ వైరస్ ప్రభావంతో మెగా క్రీడలన్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.