యూఎస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. 400మీటర్ల హర్డిల్స్ విభాగంలో అమెరికాకు చెందిన దలైలా మహ్మద్ 52.20 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు 2003లో రష్యాకు చెందిన యులియా పెచొంకినా 52.34 సెకండ్లలో పూర్తి చేసింది. ఈ రికార్డును దలైలా అధిగమించింది.
అమెరికాలోని అయోవా వేదికగా అంతర్జాతీయ అథ్లెట్ అసోసియేషన్ ఫెడరేషన్(ఐఏఏఎఫ్) ఈ పోటీలను నిర్వహించింది.
"తుదిపోరులో దలైలా ఆరంభం నుంచి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మెక్వలౌలిన్, ఆష్లే స్పెన్సర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మహ్మద్‌ను అధిగమించేందుకు వారికి అవకాశమే దొరకలేదు. గత రికార్డు కంటే 0.14 సెకండ్లు వేగంగా గమ్యాన్ని చేరి రికార్డు సాధించింది దలైలా." -ఐఏఏఎఫ్ ప్రకటన
52.20 సెకండ్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దలైలా యూఎస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలవగా... మెక్వలౌలిన్ 52.88 సెకండ్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆష్లే స్పెన్సర్ 53.11 సెకండ్లలో పూర్తి చేసి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
ఇది చదవండి: టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు కివీస్ స్పిన్ మంత్రం