తెలంగాణ

telangana

ETV Bharat / sports

లాంగ్ జంప్​లో.. జమైకన్ వరల్డ్ రికార్డు - world record in longjump

ఖతర్ దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్​షిప్​లో జమైకా క్రీడాకారుడు తాజే గేల్ 8.69 మీటర్లు దూకి వరల్డ్​ రికార్డు నెలకొల్పాడు. ఐదో అవకాశంలో ఈ ఘనత సాధించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

అథ్లెట్

By

Published : Sep 29, 2019, 11:22 AM IST

Updated : Oct 2, 2019, 10:37 AM IST

ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్​షిప్​ లాంగ్ జంప్​లో వరల్డ్​ రికార్డు నెలకొల్పాడు జమైకా క్రీడాకారుడు తాజే గేల్. ఖతర్ దోహా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో 8.69 మీటర్లు దూకి సంచలనం సృష్టించాడు. గతంలో జమైకాకే చెందిన జేమ్స్ బ్యాక్​ఫోర్డ్(8.62 మీటర్లు) రికార్డు బద్దలు కొట్టి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

ఐదో అవకాశంలో ఈ ఘనత అందుకున్నాడు తాజే. తొలి జంప్​లో 8.46 మీటర్లు దూకాడు. టోర్నీలో గెలవడానికి ఆ రికార్డే సరిపోతుంది. కానీ ఈ 23 ఏళ్ల జమైకన్ అథ్లెట్ అంతటితో ఆగకుండా 8.69 మీటర్ల దూకి సత్తాచాటాడు.

2018లో జరిగిన కామన్​వెల్త్ గేమ్స్​లో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న తాజే అనంతరం పుంజుకున్నాడు. ఈ ఏడాది జరిగిన పాన్ ఆమ్​ గేమ్స్​లో రజతం నెగ్గాడు. ఆ టోర్నీలో స్వర్ణం గెలిచిన జువాన్ మిగ్వెల్ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో మూడో స్థానానికే పరిమితమయ్యాడు.

ఇదీ చదవండి: ఫైనల్లో భారత మిక్స్​డ్​ రిలే జట్టు.. ద్యుతి ఔట్​

Last Updated : Oct 2, 2019, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details