తెలంగాణ

telangana

By

Published : Dec 28, 2019, 3:28 PM IST

ETV Bharat / sports

కామన్వెల్త్ పతక విజేతపై నాలుగేళ్ల నిషేధం

2017 కామన్వెల్త్ పోటీల్లో రజత పతకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్​పై నాలుగేళ్ల నిషేధం విధించింది నాడా. నిషేధిత ఉత్ర్పేరకాలు వాడిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

సీమ
Weightlifter

2017 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం గెల్చిన భారతవెయిట్‌లిఫ్టర్ సీమపై.. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్లు నిషేధం విధించింది. ఈమె నుంచి సేకరించిన మూత్ర నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేల్చింది.

విశాఖలో జరిగిన 34వ జాతీయ మహిళా వెయిట్​లిఫ్టింగ్ పోటీలప్పుడు ఈ శాంపిల్స్​ను సేకరించింది నాడా. శాంపిల్-ఏ ​లో ఉత్ప్రేరకాలు ఉన్న కారణంగా, శాంపిల్​-బీను పరిశీలించారు. అందులోనూ నిషేధిత ఉత్ప్రేరకాల జాడలున్నట్లు తేలింది. ఫలితంగా సీమపై నాలుగేళ్ల నిషేధం పడింది.

ఇవీ చూడండి.. 'కమిన్స్​ను దేశానికి ప్రధాని చేయండి'

ABOUT THE AUTHOR

...view details