తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కామన్వెల్త్​లో భారత్ ఆడాలన్నదే మా ఆకాంక్ష'

వచ్చే కామన్వెల్త్​ క్రీడల్లో భారత్​ పాల్గొనాలని కామన్వె​ల్త్ ఫెడరేషన్ కోరింది. రువాండాలో జరిగే సీజీఎఫ్ ​సమావేశానికి హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది.

సీజీఎఫ్

By

Published : Jul 28, 2019, 6:14 PM IST

Updated : Jul 28, 2019, 8:20 PM IST

2022 బర్మింగ్​హామ్​ కామన్వె​ల్త్​ పోటీల్లో భారత్ పాల్గొనాలని కోరింది కామన్వెల్త్​ ఫెడరేషన్​(సీజీఎఫ్). సమస్యలను పరిష్కరించేందుకు సాయపడతామని భారత ఒలింపిక్ సంఘానికి చెప్పింది. ఈ విషయాన్ని సీజీఎఫ్ ప్రతినిధి టామ్ డేగన్ ఈమెయిల్ ద్వారా తెలిపారు.

"కామన్వెల్త్ క్రీడల్లో భారత్​ పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో జరగబోయే సమావేశాలకు హాజరై తమ సమస్యలు, లక్ష్యాల గురించి చర్చించాలి. భారత్ నిర్ణయం మాకు నిరాశ కలిగించింది". -టామ్ డేగన్, సీజీఎఫ్ ప్రతినిధి

ఇంగ్లాండ్​ బర్మింగ్​హామ్ వేదికగా 2022 కామన్వె​ల్త్​ క్రీడలు జరగనున్నాయి. ఈ టోర్నీ నుంచి షూటింగ్​ను తొలగించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ షూటింగ్​ను తొలగిస్తే కామన్వెల్త్​ క్రీడలను బహిష్కరిస్తామని క్రీడాశాఖామంత్రి కిరణ్​ రిజుజుకు లేఖ రాసింది ఐఓఏ.

ఇది చదవండి: కామన్వెల్త్ క్రీడల్ని బహిష్కరిస్తామని భారత్ హెచ్చరిక

Last Updated : Jul 28, 2019, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details