తెలంగాణ

telangana

ETV Bharat / sports

2020 ఒలింపిక్స్​లో పాల్గొననున్న 11 ఏళ్ల చిన్నారి! - స్కేట్​బోర్డ్​

టోక్యో వేదికగా వచ్చే ఏడాది వేసవిలో ప్రపంచ క్రీడా సంగ్రామం ఒలింపిక్స్​ జరగనుంది. అందులో పాల్గొనడానికి సిద్ధమవుతోంది 11 ఏళ్ల బాలిక స్కై బ్రౌన్​.

watch-sky-brown-11-year-old-skateboarder-wants-to-compete-at-tokyo-2020
2020 ఒలింపిక్స్​లో పాల్గొననున్న 11 ఏళ్ల చిన్నారి

By

Published : Dec 30, 2019, 8:00 AM IST

బ్రిటన్​కు చెందిన 11 ఏళ్ల బాలిక స్కై బ్రౌన్.. వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్​లో స్కేట్​బోర్డు పోటీల్లో పాల్గొనాలి అనుకుంటోంది. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తోందీ చిన్నారి. ఇప్పటికే ఈ ఏడాది ఐరోపా​, ఆసియా, దక్షిణ అమెరికాల్లో జరిగిన స్కేటింగ్ టోర్నీల్లో సత్తా చాటింది.

స్కేటర్​ స్కైబ్రౌన్​తో ఇంటర్వ్యూ..

ముఖ్యంగా ఫ్రంట్​సైడ్​ ట్రిక్​లతో అద్భుతమైన ప్రదర్శన చేసింది. స్కేట్​బోర్డ్​​లో ఇంత వరకూ మహిళలు చేయని ట్రిక్​లను ఈ బాలిక అవలీలగా చేస్తూ ఆకట్టుకుంది.

స్కై బ్రౌన్​ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:-
⦁ మూడేళ్ల వయసులోనే స్కేట్​బోర్డింగ్​ చేయటం ప్రారంభించింది.
⦁ 2016లో జరిగిన వాన్స్​ యూఎస్​ ఓపెన్​ ప్రో సిరీస్​లో పాల్గొన్న అతి చిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది.
⦁ ​ఫిబ్రవరిలో నైక్ కంపెనీ "డ్రీం క్రేజియర్" ప్రచారంలో చేరిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.
⦁ బ్రౌన్ టోక్యో 2020 కి అర్హత సాధిస్తే, ఆమె గ్రేట్ బ్రిటన్​కు చెందిన అతి పిన్న వయస్కురాలైన ఒలింపియన్ అవుతుంది.

ఇదీ చదవండి:- మళ్లీ మైదానంలోకి ఎప్పుడొస్తానో తెలియదు

ABOUT THE AUTHOR

...view details