తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఏడుగురు క్రీడాకారులకు పద్మశ్రీ - Padma Shri

కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ఏడింటిని క్రీడాకారులు దక్కించుకున్నారు. మొత్తం 119 అవార్డులను కేంద్రం ప్రకటించింది.

TT player Mouma Das, five other sportspersons awarded Padma Shri
ఏడుగురు క్రీడాకారులకు పద్మశ్రీ

By

Published : Jan 25, 2021, 11:00 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను సోమవారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'పద్మ' అవార్డుల జాబితాను విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గాను ఏడుగురికి పద్మవిభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మంది పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. కాగా, క్రీడా విభాగంలో ఏడుగురికి పద్మశ్రీ అవార్డు లభించింది.

అవార్డు గ్రహీతలు

పీ అనిత (తమిళనాడు), మౌమా దాస్‌ (పశ్చిమబెంగాల్‌), అన్షు జంసేన్సా (అరుణాచల్‌ప్రదేశ్‌), మాధవన్‌ నంబియార్‌ (కేరళ), సుధా హరినారయణ్‌ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌), వీరేంద్ర సింగ్‌ (హరియాణా), కే.వై వెంకటేశ్‌ (కర్ణాటక)

ఇదీ చూడండి:పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

ABOUT THE AUTHOR

...view details