తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాధ్యతలు మోయగలరు.. బరువులు కష్టమే!

జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ ప్రధానితో కలిసి సుమో రెజ్లింగ్ పోటీలను వీక్షించారు. బహుమతి ప్రదానోత్సవంలో విజేతలకిచ్చే కప్పు మోయలేక వేరొకరి సాయం తీసుకున్నారు ఇరువురు అగ్రనేతలు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​ అయింది.

By

Published : May 26, 2019, 5:57 PM IST

ట్రంప్ జపాన్

జపాన్ పర్యటనలో ట్రంప్

దేశ బరువు బాధ్యతలను తమ భుజ స్కందాలపై మోసే అధినేతలు నిజమైన బరువును మోయడంలో మాత్రం కాస్త తడబడ్డారు. జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ ప్రధాని షింజో అబేతో కలిసి సుమో రెజ్లింగ్ పోటీలకు హాజరయ్యారు. అయితే విజేతలకిచ్చే టైటిల్​ కప్పు భారీ ఆకారంలో ఉంది. ఇరునేతలు ఆ కప్పు బరువు మోయలేక వేరొకరి సాయంపై ఆధారపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.ఈ టోర్నమెంట్​కు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణితో కలిసి హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details