తెలంగాణ

telangana

ETV Bharat / sports

దశాబ్దం రివ్యూ: మధుర స్మృతులు.. మరపురాని టోర్నీలు - ఈ దశాబ్దపు అత్యుత్తమ ప్రదర్శనలు

ఇంకొన్ని గంటల్లో ఈ దశాబ్దం ముగిసిపోనుంది. ఈ పదేళ్లలో క్రీడాభిమానులకు ఎన్నో మరపురాని జ్ఞాపకాలు మిగిలాయి. భారత్ ప్రపంచకప్ గెలవడం, సచిన్ రిటైర్మెంట్, సింధు ప్రపంచ ఛాంపియన్​గా నిలవడం, మహీ టెస్టు వీడ్కోలు లాంటివి ఎన్నో జరిగాయి. వీటిపై ఓ లుక్కేద్దాం!

Top Performances Of The Decade
దశాబ్దం రివ్యూ: మధుర స్మృతులు.. మరపురాని టోర్నీలు

By

Published : Dec 31, 2019, 6:34 AM IST

కాలచక్రంలో కాలం గిర్రున తిరిగింది. 2019కి ముగింపు పలికి 2020కి శుభాహ్వానమివ్వనుంది. అంతేకాకుండా ఈ దశాబ్దం ముగిసేందుకు ఇంక కొన్ని గంటలే మిగిలాయి. ఈ పదేళ్లలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, భావోద్వేగాలు క్రీడాఅభిమానులకు మిగిలిపోయాయి. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మిటన్​, రెజ్లింగ్.. ఆట ఏదైనా మరపురాని క్షణాలతో, మరలా చూడలనే ఆలోచనలతో అద్భుతంగా ఆవిష్కరించింది ఈ దశకం. ఈ సందర్భంగా గత పదేళ్ల క్రీడా చరిత్రలో మధుర స్మృతులు, భావోద్వోగ ఘటనలను ఒక్కసారి నెమరు వేసుకుందాం..

అత్యధిక గ్రాండ్​స్లామ్​లతో ఫెదరర్ రికార్డు..

టెన్నిస్​ దిగ్గజం రోజెర్​ ఫెదరర్​.. 2010ని ఘనంగా ఆరంభించాడు. 2009లో వింబుల్డన్​ నెగ్గి పురుషుల సింగిల్స్​లో అత్యధిక గ్రాండ్​స్లామ్ నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. 15వ టైటిల్ అందుకొని అమెరికాకు చెందిన పీట్ సంప్రాస్(14) రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత ఎన్నో విజయాలు అందుకున్న ఈ దిగ్గజం.. ప్రస్తుతం 20 గ్రాండ్​స్లామ్​లతో అగ్రస్థానంలో ఉన్నాడు ఫెదరర్.

అత్యధిక గ్రాండ్​స్లామ్​లతో ఫెదరర్ రికార్డు..

అతిచిన్న వయసులో ఏఫ్​-1 ఛాంపియన్​గా..

ఈ దశకంలో జర్మనీకి చెందిన ఫార్ములా వన్ డ్రైవర్ సెబాస్టియన్ వెట్టెల్ అరుదైన ఘనత సాధించాడు. 2010లో జరిగిన ఎఫ్​1 రేసులో ఛాంపియన్​గా నిలిచాడు. అప్పటికి 23ఏళ్ల 134రోజుల వయుసున్న సెబాస్టియన్ రెడ్​బుల్ టైటిల్ నెగ్గాడు. అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన డ్రైవర్​గా రికార్డు సృష్టించాడు.

సెబాస్టియన్ వెట్టెల్

అత్యధిక పతకాలతో భారత్...

2010 కామన్​వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన భారత్.. అత్యధిక పతకాలు అందుకుని చరిత్ర సృష్టించింది. దిల్లీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో.. 101 మెడల్స్ ఖాతాలో వేసుకుంది. ఇందులో 39 స్వర్ణాలు ఉన్నాయి.

2010 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం

రెండోసారి విశ్వవిజేతగా..

2011 ఏప్రిల్ 2.. భారత్ క్రికెట్ అభిమానులు మర్చిపోలేని రోజు. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత్.. ప్రపంచకప్​ ఫైనల్​లో శ్రీలంకను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. 28 ఏళ్ల అనంతరం ప్రపంచకప్​ను సొంతం చేసుకొని భారత అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని అందించింది. అంతకుముందు కపిల్ దేవ్​ సారథ్యంలో తొలిసారి ప్రపంచకప్​ను కైవసం చేసుకుంది టీమిండియా.

రెండోసారి విశ్వవిజేతగా టీమిండియా

లండన్ ఒలింపిక్స్​లో భారత్​కు ఆరు మెడల్స్​..

ఒలింపిక్స్​ సమరంలో భారత్​ అత్యధికంగా ఆరు వ్యక్తిగత పతకాలు కైవసం చేసుకున్న టోర్నీ.. 2012 లండన్ విశ్వక్రీడలు. రెండు రజతాలు, 4 కాంస్యాలు సొంతం చేసుకుంది భారత్​. ఒలింపిక్స్​లో వ్యక్తిగతంగా రెండు పతకాలు సాధించిన భారత క్రీడాకారుడిగా సుశీల్ కుమార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008 బీజింగ్ ఒలింపిక్స్​లో కాంస్యం సాధించాడు సుశీల్.

సుశీల్ కుమార్

క్రికెట్ దేవుడి నిష్క్రమణ..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ 2013లో అంతర్జాతీయ క్రికెట్​ నుంచి వైదొలిగాడు. 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి​ ముగింపు పలికాడు. ఆ ఏడాది నవంబరులో.. వెస్టిండీస్​తో కెరీర్​ చివరి టెస్టు మ్యాచ్​ ఆడాడు సచిన్. ఆ మ్యాచ్​లో 74 పరుగులు చేశాడు. అంతకుముందు 2012లోనే వన్డేలకు గుడ్​బై చెప్పాడు మాస్టర్.

క్రికెట్ దేవుడు నిష్క్రమణ..

ఛాంపియన్స్​గా భారత్​..

2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన తుది పోరులో ఆతిథ్య జట్టును ఓడించి టీమిండియా కప్పు కైవసం చేసుకుంది. మూడు పెద్ద టోర్నీ(ఐసీసీ)లను ధోనీ సారథ్యంలో సొంతం చేసుకుంది భారత్.

ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్

మహీ టెస్టులకు వీడ్కోలు..

2014 డిసెంబరులో మహేంద్రసింగ్ ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి క్రీడాభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్​ మధ్యలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. 90 టెస్టుల్లో ధోనీ 4876 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 33 అర్ధసెంచరీలు ఉన్నాయి.

మహీ టెస్టులకు వీడ్కోలు..

ఐదోసారి విశ్వవిజేతగా ఆసీస్​..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగిన 2015 ప్రపంచకప్​లో ఆతిథ్య జట్లు ఫైనల్​కు చేరాయి. తుదిపోరులో కివీస్​ను ఓడించి ఆసీస్​ ఐదోసారి విశ్వవిజేతగా అవతరించింది. మిషెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్​గా ఎంపికయ్యాడు.

అత్యధిక ఒలింపిక్ పతకాలతో బంగారు చేప..

అమెరికా ఈతగాడు మైకేల్ ఫెల్ప్స్... అతడి స్మిమ్మింగ్ చూస్తే సముద్రం మీద నడిచి వెళ్తున్నాడా అని అనిపిస్తుంది. అందుకేబంగారు చేపగా పేరుగాంచాడు. వ్యక్తిగత విభాగంలో మొత్తం 28 ఒలింపిక్ పతకాలు గెల్చుకున్న ఫెల్ప్స్... ఇప్పటివరకు అత్యధిక మెడల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇందులో 23 స్వర్ణాలున్నాయి. 2004 నుంచి 2016 ఒలింపిక్స్ వరకు అతడి పతకాల దాహం కొనసాగింది.

మైకేల్ ఫెల్ప్స్​

ఐపీఎల్​లో అత్యధిక పరుగులు..

ఓ ఐపీఎల్​ సీజన్​లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు విరాట్​ కోహ్లీ పేరిట నమోదైంది. 2016లో 973 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఐపీఎల్​లో విరాట్ 5412 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 36 అర్ధసెంచరీలు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ

12వసారి రియల్​ మాడ్రిడ్​ విజేత..

2017లో ఫుట్​భాల్ ఛాంపియన్స్​ లీగ్​లో రియల్ మాడ్రిడ్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో జువెంటస్​ను 4-1 తేడాతో ఓడించి 12వసారి టైటిల్ చేజిక్కించుకుంది.

12వసారి రియల్​ మాడ్రిడ్​ విజేత..

ఫిఫా ప్రపంచకప్​ విజేతగా ఫ్రాన్స్..

రష్యా వేదికగా జరిగిన 2018 ఫిఫా ఫుట్​బాల్ ప్రపంచకప్​ విజేతగా ఫ్రాన్స్​ నిలిచింది. ఫైనల్లో క్రోయేషియాపై 4-2 తేడాతో నెగ్గి.. రెండోసారి విశ్వవిజేతగా అవతరించింది.

ఫిఫా ప్రపంచకప్​ విజేతగా ఫ్రాన్స్..

తొలిసారి విశ్వవిజేతగా ఇంగ్లాండ్​..

క్రికెట్​ పుటినిల్లుగా పిలిచే ఇంగ్లాండ్​.. తొలిసారిగా ప్రపంచకప్​ను సొంతం చేసుకుంది 2019లోనే. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్​పై నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఫైనల్లో ఇరుజట్ల స్కోర్లు సమమయ్యాయి. సూపర్​ ఓవర్​లోనూ ఇదే పరిస్థితి. అయితే బౌండరీ కౌంట్ ద్వారా ఫలితం ఇంగ్లాండ్​కు అనుకూలంగా వచ్చింది.

తొలిసారి విశ్వవిజేతగా ఇంగ్లాండ్​..

ప్రపంచ ఛాంపియన్​గా సింధు..

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్ టైటిల్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్​గా రికార్డు సృష్టించింది పీవీ సింధు.ఈ ఏడాది ఆగస్టు 25న జరిగిన ఫైనల్లో జపాన్​కు చెందిన నవోమీ ఒకుహురాపై 21-17, 21-7 తేడాతో విజయం సాధించింది.

పీవీ సింధు

విజయంతో ఏడాదిని ముగించిన కోహ్లీసేన..

వెస్టిండీస్ సిరీస్​లో భాగంగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రోహిత్, రాహుల్, కోహ్లీ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్​ను గెలిచి సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది కోహ్లీసేన. ఫలితంగా విజయంతో ఈ ఏడాదిని ముగించింది.

ఇదీ చదవండి: క్రికెట్​ ప్రపంచంలో 'రారాజు'గా కోహ్లీ.. 'చక్రవర్తి'గా గంగూలీ

ABOUT THE AUTHOR

...view details