కరోనా వ్యాప్తి పెరుగుతుండటం వల్ల ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో ఒలింపిక్ అథ్లెట్స్ గ్రామాన్ని, జపాన్లోని నిరాశ్రయుల కోసం అందుబాటులోకి తీసుకురావాలని ఓ బృందం ఆన్లైన్ పిటిషన్ వేసింది. ఇందుకోసం దాదాపు పదివేలకు మందికి పైగా సంతకాలను సేకరించింది. దానిని ఒలింపిక్ నిర్వాహకులు, ఆ నగర ప్రభుత్వానికి పంపింది. ఆ గ్రామంలో 11 వేల మంది అథ్లెట్స్, 4, 400 మంది పారా ఒలింపిక్ క్రీడాకారుల కోసం వసతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం వైరస్ తీవ్రత ఎక్కువవుతుండటం వల్ల ఇప్పుడు ఆ గ్రామమంతా ఖాళీగానే ఉంది. ఈ కారణంగానే దానిని నిరాశ్రయులకు వసతి కల్పించేందుకు వినియోగించాలని సదరు బృందం కోరింది. అయితే టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు మాత్రం ఈ వినతిని తిరస్కరించారు. అక్కడి ప్రభుత్వమూ ఈ పిటిషన్పై స్పందించలేదు.