తెలంగాణ

telangana

ETV Bharat / sports

టోక్యోనే నా చివరి ఒలింపిక్స్​: మేరీ కోమ్​ - Tokyo Olympics will be the culmination of my career, says Mary Kom

టోక్యో వేదికగా జరిగేదే​ తన చివరి ఒలింపిక్స్​ అని భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్​ వెల్లడించింది. వయసు పరిమితి కారణంగా తదుపరి ప్యారిస్​ ఒలింపిక్స్​కు​ దూరం కాక తప్పదని తెలిపింది.

Tokyo Olympics will be the culmination of my career, says Mary Kom
టోక్యోనే నా చివరి ఒలింపిక్స్​: మేరీ కోమ్​

By

Published : Mar 11, 2021, 7:42 AM IST

ఈ ఏడాది టోక్యోలో జరగబోయేది తన చివరి ఒలింపిక్స్​ అని భారత దిగ్గజ బాక్సర్​ మేరీ కోమ్​ పేర్కొంది. 2012 లండన్​ ఒలింపిక్స్​లో కాంస్యం సాధించి దేశంలో మహిళల బాక్సింగ్​కు ఆదరణ పెరగడంలో కీలక పాత్ర పోషించిన మేరీ.. ఈ ఏడాది జులై-ఆగస్టు నెలల్లో జరిగే ఒలింపిక్స్​ తర్వాత తాను ఈ మెగా టోర్నీలో కనిపించనంది.

"అవును. టోక్యోలో జరగబోయేదే నా చివరి ఒలింపిక్స్​. ఇక్కడ వయసు కీలకమవుతోంది. ప్రస్తుతం నాకు 38 ఏళ్లు. త్వరలో 39వ పడిలోకి వెళ్తున్నా. ఇంకో మూణ్నాలుగేళ్లు ఆటలో కొనసాగడం అంటే కష్టం. ప్యారిస్​లో జరిగే 2024 ఒలింపిక్స్​లో నేను ఆడాలన్నా అనుమతించపోవచ్చు. బాక్సర్లకు వయసు పరిమితి 40 ఏళ్లే. టోక్యో ఒలింపిక్స్​ ఏడాది వాయిదా పడ్డాయి కాబట్టి ఆ పరిమితిని ఒక సంవత్సరం పెంచారు."

-మేరీ కోమ్​, భారత బాక్సింగ్ దిగ్గజం.

ఇదీ చదవండి:పొట్టి ప్రపంచకప్ ముందు మనోళ్లు సత్తా చాటేనా?

ABOUT THE AUTHOR

...view details