భారత జిమ్నాస్టిక్స్ జడ్జి దీపక్ కాబ్రా(deepak kabra) అరుదైన ఘనత సాధించనున్నాడు. ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో జడ్జిగా వ్యవహరించనున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నాడు. టోక్యో క్రీడల్లో పురుషుల ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్‌లో దీపక్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ జడ్జిగా దీపక్ - తొలి భారతీయుడిగా రికార్డ్ - ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్ తొలి జడ్జి
ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో జడ్జిగా దీపక్ కాబ్రా(deepak kabra) వ్యవహరించనున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నాడు. రానున్న టోక్యో క్రీడల్లో పురుషుల ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్‌లో దీపక్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
దీపక్ కాబ్రా, జిమ్నాస్టిక్ జడ్జి
"నిరుడు మార్చిలో ఆహ్వానం అందింది. కరోనా కారణంగా ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. ఏడాది పాటు ఆత్రుతగా ఎదురు చూడాల్సొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి పిలుపొచ్చింది. అయితే కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా ఒలింపిక్స్‌పై ఇప్పటికీ అనిశ్చితి ఉంది. ఏదేమైనా ఒలింపిక్స్ స్వప్నం సాకారం అవుతున్నందుకు ఆనందంగా ఉంది" అని దీపక్ తెలిపాడు.
ఇదీ చదవండి:పదేళ్ల తర్వాత భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్యకు గుర్తింపు
Last Updated : Jul 14, 2021, 12:18 PM IST