టేబుల్ టెన్నిస్‌లో తొలిసారి ఒలింపిక్స్ అర్హత సాధించే అవకాశాన్ని భారత టీటీ జట్లు త్రుటిలో చేజార్చుకున్నాయి. పోర్చుగల్‌లో జరుగుతోన్న ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కే పరిమితమై నిరాశపరిచాయి. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భారత్ పురుషుల, మహిళా జట్లు ఓటమిని చవిచూశాయి.
ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత టీటీ జట్లకు నిరాశ
టేబుల్ టెన్నిస్ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని భారత టీటీ జట్లు కోల్పోయాయి. క్వాలిఫయింగ్ పోటీల్లో ప్రిక్వార్టర్లో ఓడిపోయి నిరాశపర్చాయి.
ఒలింపిక్
స్లొవేనియా చేతిలో పురుషుల జట్టు 1-3తో పరాజయం పాలవ్వగా, మహిళల జట్టు రొమేనియా చేతిలో 2-3తో పోరాడి ఓడింది. ఇందులో గెలిచుంటే భారత టీటీ జట్లు, ఒలింపిక్స్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించేవి. అంతకుముందు లక్సెంబర్గ్‌పై పురుషుల జట్టు 3-0తో, స్వీడన్‌పై మహిళా జట్టు 3-2తో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి.
ఇవీ చూడండి.. అభిమానిని తిట్టి, ఆపై క్షమాపణలు చెప్పిన స్టోక్స్
Last Updated : Feb 18, 2020, 8:38 AM IST