తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​కు మరో ముగ్గురు భారత అథ్లెట్లు అర్హత - tokyo olimpics 2020

టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్​కు మరో ముగ్గురు భారత అథ్లెట్లు అర్హత సాధించారు. దీంతో ఒలింపిక్స్​లో పాల్గొనే వారి సంఖ్య ఇప్పటివరకు ఐదుకు చేరింది. దేశీయంగా జరుగుతున్న నేషనల్​ రేస్​ వాకింగ్​ ఛాంపియన్​షిప్​లో.. 20 కి.మీ.ల విభాగంలో పలు రికార్డులు నమోదయ్యాయి.

Three more race walkers qualify for Olympics; new national records in men's and women's 20km event
పారాలింపిక్స్​కు మరో ముగ్గురు భారత అథ్లెట్లు

By

Published : Feb 13, 2021, 3:30 PM IST

భారత తరఫున మరో ముగ్గురు అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ 2020​కు అర్హత సాధించారు. నేషనల్​ ఓపెన్​ రేస్​ వాకింగ్​ ఛాంపియన్ షిప్​​లో భాగంగా నిర్వహించిన పోటీల్లో సందీప్​ కుమార్, ప్రియాంక గోస్వామిలు పురుషుల, మహిళల 20 కి.మీ.ల విభాగంలో జాతీయ రికార్డులు నెలకొల్పారు.

కొవిడ్​ తర్వాత దేశవాళీలో జరుగుతున్న అతి పెద్ద పోటీలు ఇవే కావడం గమనార్హం. తాజా ముగ్గురితో కలిపి టోక్యో గేమ్స్​​కు అర్హత పొందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. 20 కి.మీ.ల విభాగంలో కేటీ ఇర్ఫాన్​, భావన జాట్​లు ఇది వరకే అర్హత సాధించారు.

తాజా పోటీల్లో సందీప్..​ గంటా 20 నిమిషాల 16 సెకన్లలో 20 కి.మీ.లు వాకింగ్​ చేయగా.. గోస్వామి గంటా 28 నిమిషాల 45 సెకన్లలో టాస్క్ పూర్తి చేసింది. మరో అథ్లెట్​ రాహుల్​ కూడా గంటా 20 నిమిషాల 21 సెకన్లలో వాక్​ చేశాడు.

కాగా, ఒలింపిక్స్​లో అర్హత పొందాలంటే మహిళ అథ్లెట్లకు గంటా ముప్పై ఒకటి నిమిషాల్లో, పురుషులు అయితే గంటా ఇరవై ఒకటి నిమిషాల్లో 20 కి.మీ.ల నడకను పూర్తి చేయాలి.

ఒలింపిక్స్​ను టోక్యో వేదికగా ఈ ఏడాది జులై-ఆగస్టు మధ్య నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:చెన్నై టెస్టు: రోహిత్​ శతకం- అరుదైన రికార్డు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details