'డబ్ల్యూడబ్ల్యూఈ'లో దిగ్గజ రెజ్లర్ అండర్టేకర్(అసలు పేరు మార్క్ కాల్వే) శకం ముగిసింది. ఆదివారం జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ డాక్యూసిరీస్ 'ది లాస్ట్ రైడ్'లోని చివరి ఎపిసోడ్(మ్యాచ్)తో అతడు రిటైర్ అయ్యాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన సహచరులు ఘనంగా వీడ్కోలు పలికారు. అండర్ టేకర్‌కు సమకాలికులైన ట్రిపుల్ హెచ్, షేన్ మెక్ మహోన్, రకీషీ, షాన్ మైకేల్స్, బిగ్ షో, జేబీఎల్, రిక్ ఫ్లెయిర్, కేన్, మిక్ ఫోలీ తదితరులు వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌తో తాను రిటైర్మెంట్ తీసుకుంటానని ఈ ఏడాది జూన్ 22నే అండర్ టేకర్ చెప్పాడు.
"మూడు దశాబ్దాలుగా ఎంతోమంది ప్రత్యర్థులను చిత్తు చేసిన నేను.. వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఇకపై నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇంతకాలం నాపై ప్రేమ చూపిన అభిమానులకు ధన్యావాదాలు" అని అండర్టేకర్ చెప్పాడు.