తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్విమ్మింగ్​లో శ్రీహరి నటరాజ్​ సరికొత్త రికార్డు

ఏస్​ ఇండియన్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్​ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఉజ్బెకిస్థాన్ వేదికగా జరుగుతోన్న ఓపెన్ ఛాంపియన్​షిప్ స్విమ్మింగ్ పోటీల్లో 50 మీటర్ల దూరాన్ని కేవలం 25.11 సెకండ్లలో ఈది.. రెండో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

Swimmer Srihari Nataraj creates national record, wins second gold in Uzbekistan
శ్రీహరి నటరాజ్, స్విమ్మింగ్​లో జాతీయ రికార్డు

By

Published : Apr 18, 2021, 5:39 PM IST

ఏస్​ ఇండియన్​ స్విమ్మర్​ శ్రీహరి నటరాజ్​ 50 మీటర్ల బ్యాక్​స్ట్రోక్​ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఉజ్బెకిస్థాన్ వేదికగా జరుగుతోన్న ఓపెన్ ఛాంపియన్​షిప్​ స్విమ్మింగ్​ పోటీల్లో కేవలం 25.11 సెకండ్లలో ఈది.. రెండో గోల్డ్​మెడల్​ను కైవసం చేసుకున్నాడు.

ఈ బంగారు పతకంతో ఈ ఈవెంట్​లో భారత పతకాల సంఖ్య 29కి చేరింది. అందులో 18 స్వర్ణాలు, 7 రజతాలు కాగా మరో 4 కాంస్యాలు. ఈ వారం ప్రారంభంలో 100 మీటర్ల బ్యాక్​స్ట్రోక్ విభాగంలో రెండు సార్లు రికార్డులు నెలకొల్పిన ఈ బెంగళూరు యువకుడికి.. ప్రస్తుత ఫీట్ మూడోది.

ఇదీ చదవండి:నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా: చాను

టోక్యో ఒలింపిక్స్​ 'బీ' జాబితాకి శ్రీహరి అర్హత సాధించాడు. 100 మీటర్ల బ్యాక్​స్ట్రోక్​ విభాగాన్ని 54.10 సెకండ్లలో ఈదిన శ్రీహరి.. 0.22 సెకండ్ల తేడాతో 'ఏ' లిస్టులో స్థానం కోల్పోయాడు.

మరో స్విమ్మర్​ సజన్ ప్రకాష్ కూడా ఈ పోటీల్లో ఆకట్టుకున్నాడు. పాల్గొన్న నాలుగు విభాగాలలోనూ బంగారు పతకాలను సాధించాడు.

మహిళల 50 మీటర్ల బ్యాక్​స్ట్రోక్​ విభాగంలో మాన పటేల్​, సువనా భాస్కర్​ వరుసగా బంగారు, రజత పతకాలను సాధించారు.

ఇదీ చదవండి:మాక్సీ​, ఏబీ విధ్వంసం.. కోల్​కతా లక్ష్యం 205

ABOUT THE AUTHOR

...view details