మల్లయోధుడు సాగర్ రానా హత్య కేసు ప్రధాన నిందితుడు రెజ్లర్ సుశీల్ కుమార్‌పై(sushil kumar) ప్రశంసలు కురిపించాడు మరో రెజ్లర్ బజ్రంగ్ పూనియా. సుశీల్ 56 ఏళ్ల నిరీక్షణకు తెరదించి.. రెజ్లింగ్‌కు గొప్ప కళను తీసుకొచ్చాడని కొనియాడాడు. దిల్లీలో సీఐఎస్ఎఫ్ నిర్వహించిన సత్కార సభలో ఈ వ్యాఖ్యలు చేశాడు పూనియా. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించాడీ రెజ్లర్.
"సుశీల్ కుమార్ కంటే ఎవరినీ ఉత్తమ రెజర్ల్గా పరిగణించలేను. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పతకం అందించి.. రెజ్లింగ్‌కు వైభవం తీసుకొచ్చాడు. రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకుని 56ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు."
- రెజ్లర్ బజ్రంగ్ పూనియా
హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ గురించి ప్రశ్నించగా.. దానిని తోసిపుచ్చాడు బజ్రంగ్. కేవలం అతని క్రీడా జీవితం గురించే మాట్లాతున్నానని వివరణ ఇచ్చాడు.
అనంతరం "టోక్యో ఒలింపిక్స్‌లో ఉత్తమ ప్రదర్శన చేశాను. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ.. 2024లో (ఒలింపిక్స్) స్వర్ణ పతకాన్ని గెలవడానికి ప్రయత్నిస్తాను. అందుకు మరింత కష్టపడాల్సి ఉంది" అని చెప్పుకొచ్చాడు పూనియా.
భవిష్యత్‌లో భారత్ క్రీడల్లో మరింత మెరుగుపడాలంటే.. తల్లిదండ్రులు పిల్లలని ప్రోత్సహించాలని.. వారే తొలి గురవులని పేర్కొన్నాడు. అలాగే క్రీడలకు తగిన అన్ని సౌకర్యాలను, మంచి ఆహారాన్ని వారికి అందించాలన్నాడు.
ఇదీ చూడండి:Neeraj Chopra: 'ఈ ఏడాదికి ముగింపు పలుకుతున్నా'