టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అథ్లెట్లకు మార్చి నెలఖారు నుంచి కొవిడ్ టీకా అందే అవకాశముంది. ఈ మేరకు క్రీడా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఒలింపిక్స్ అథ్లెట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే ఆ శాఖ.. ఆరోగ్య శాఖను అభ్యర్థించింది.
"ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు, కోచ్‌లు, సిబ్బందికి టీకా పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య శాఖను కోరాం. రెండు దశల్లో ఆ ప్రక్రియ నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశాం. ఆరోగ్య శాఖ అనుమతివ్వగానే అమలు చేస్తాం. మార్చి చివరి కల్లా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని అనుకుంటున్నాం." అని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.