తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇకపై క్రీడగా యోగా.. కేంద్రం ఆమోదం - పోటీ క్రీడగా యోగ

యోగాసనాలను క్రీడగా ఆమోదిస్తున్నట్లు భారతీయ క్రీడా మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. ఈ విషయాన్ని సదరు శాఖ మంత్రి కిరణ్​ రిజిజు వెల్లడించారు. ప్రభుత్వం చొరవ వల్ల ప్రజల్లో యోగాపై అవగాహన పెరగడం సహా వారి ఆరోగ్యానికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.

Sports Ministry formally recognises yogasana as competitive sport
పోటీక్రీడగా యోగాకు క్రీడామంత్రిత్వ శాఖ ఆమోదం

By

Published : Dec 17, 2020, 4:10 PM IST

యోగాసనాలను ఇకపై క్రీడగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది భారత క్రీడా మంత్రిత్వశాఖ. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది. క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజిజు దీనికి అమోదం తెలిపారు. దీని వల్ల యోగాపై ప్రజల్లో అవగాహన పెరగడం సహా శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుందని వెల్లడించారు.

"యోగా క్రీడగా చాలా కాలం నుంచి ఉంది. అయితే ప్రస్తుతం దీన్ని గుర్తించిన భారత ప్రభుత్వం.. పోటీపడే స్పోర్ట్​గా అధికారికం చేసింది. ఈరోజు చాలా మంచి రోజు. యోగాసనాలను పోటీ క్రీడగా ప్రారంభించాం. ఇది చాలా దూరం వెళుతుందని భావిస్తున్నా. యోగాసనాలు క్రీడగా ఆమోదం పొందిన తర్వాత జాతీయ యోగాసన క్రీడ సమాఖ్యకు ప్రభుత్వం నుంచి ఆర్థిక మద్దతు లభిస్తుంది."

- కిరణ్​ రిజిజు, కేంద్ర క్రీడామంత్రి

అంతర్జాతీయ యోగా క్రీడా సమాఖ్యను గతేడాది నవంబరులో స్థాపించారు. దీనికి యోగాగురు బాబా రామ్​దేవ్ అధ్యక్షునిగా​, డాక్టర్​ హెచ్​ఆర్​ నాగేంద్ర సెక్రటరీ జనరల్​గా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details