కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించిన ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించారు.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు కరోనా - కిరణ్ రిజిజు కొవిడ్ 19 పాజిటివ్
క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
కిరణ్ రిజిజు
"ఈరోజు చేసుకున్న కరోనా టెస్టులో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో స్వీయ నిర్బంధంలో ఉన్నా. ఇటీవల నన్ను కలవడానికి వచ్చిన వారందరూ టెస్టు చేయించుకోవాలని కోరుతున్నా. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నా" అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు రిజిజు.