ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా.. ఆదివారం ఫేర్‌వెల్ మ్యాచ్‌లో చివరిసారిగా రాకెట్ పట్టి అలరించింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్డేడియంలో జరిగిన ఫేర్‌వెల్ మ్యాచ్‌లో సానియా.. సింగిల్స్‌లో బోపన్నతో తలపడింది. డబుల్స్‌లో బోపన్నతో జతకట్టి.. ఇవాన్ డోడిక్, మ్యాటిక్ జోడీతో ఆడింది. నామమాత్రంగా జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో సానియానే విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లు చూడడానికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్, హీరో దుల్కర్ సల్మాన్, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తరలివచ్చారు. సానియాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఫేర్‌వెల్ మ్యాచ్‌ల అనంతరం.. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన రెడ్ ప్రత్యేక కార్పెట్ ఈవెంట్‌లోనూ సినీ, రాజీకయ ప్రముఖులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహ్మాన్, ప్రిన్స్ మహేశ్ బాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అయితే సానియా మీర్జా గౌరవార్ధం ఆదివారం జరిగిన అన్ని కార్యక్రమాల్లో ఆమె భర్త షోయబ్ మాలిక్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆదివారం పొద్దున్న నుంచి నెటిజన్లు షోయబ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి.
ప్రస్తుతం షోయబ్.. పాకిస్థాన్ సూపర్ లీగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు. షోయబ్‌కు సంబంధించిన ఓ వీడియో సానియా ఫేర్‌వెల్ ఈవెంట్‌కు కొద్ది రోజుల కిందట నెట్టింట చక్కర్లు కొట్టింది. పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించే షోయబ్.. ఆ ఫ్రాంచైజీ మెంటార్, పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌తో డిస్కషన్‌కు దిగినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది.
అయితే భార్య సానియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో షోయబ్ పాల్గొనకపోవడంతో ఈ వీడియో మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. సానియా-షోయబ్ జంట విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇరువురు మీకు మీరే మాకు మేమే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. వీరి మధ్య అంతా అయిపోయిందని, విడాకులే మాత్రమే పెండింగ్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.