తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియన్​ ఛాంపియన్​షిప్​లో షూటర్ సౌరభ్​కు రజతం

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన భారత షూటర్ల సంఖ్య 15కు చేరింది. ఆసియన్ ఛాంపినయన్​షిప్​లో సోమవారం జరిగిన పోటీల్లో సౌరభ్ చౌదరి రజతం దక్కించుకున్నాడు.

సౌరభ్ చౌదరి

By

Published : Nov 11, 2019, 8:08 PM IST

Updated : Nov 11, 2019, 8:28 PM IST

ఆసియన్ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరి రజతం దక్కించుకున్నాడు. ఫైనల్లో 244.5 పాయింట్లుతో రెండో స్థానంలో నిలిచాడు.

ఈ టోర్నీలో ఉత్తరకొరియా షూటర్ కిమ్‌ సోంగ్‌ గుక్ (246.5) స్వర్ణం సాధించాడు. ఫైనల్‌కు చేరిన మరో భారత షూటర్‌ అభిషేక్‌ వర్మ 181.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఇప్పటికే సౌరభ్‌, అభిషేక్.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటికే పదిహేను మంది భారత షూటర్లు అర్హత సాధించారు. రియో ఒలింపిక్స్ (12)లో పాల్గొన్న వారి కంటే ఇది ఎక్కువ.

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత షూటర్లు:

  • 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ( అంజుమ్‌, అపుర్వీ చండేలా, దివ్యాన్ష్‌ సింగ్‌, దీపక్‌ కుమార్)
  • మహిళా 25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ (రాహుల్, చింకి యాదవ్‌)
  • 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ (సౌరభ్‌ చౌదరి, అభిషేక్‌ వర్మ, మను బాకర్‌, యశస్విని)
  • పురుషుల స్కీట్‌ (అంగద్‌ వీర్‌ సింగ్‌, మైరాజ్‌ అహ్మద్‌)
  • 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌ (ఐశ్వర్య సింగ్, సంజీవ్‌ రాజ్‌పుత్‌, తేజస్విని సావంత్‌)

ఇదీ చదవండి: విజయంలో నా పాత్ర కూడా ఉంది: శ్రేయస్ అయ్యర్

Last Updated : Nov 11, 2019, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details