భారత్‌లో మరో గ్రాండ్‌మాస్టర్ (Chess Grandmaster) అవతరించాడు. మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల సంకల్ప్ గుప్తా (Sankalp Gupta GM).. 71వ జీఎంగా రికార్డులకెక్కాడు. సెర్బియాలో జరుగుతున్న జీఎం ఆస్క్ 3 రౌండ్ రాబిన్ ఈవెంట్లో రెండో స్థానంలో నిలవడం సహా 6.5 పాయింట్ల సాధించి ఈ ఘనత సాధించాడు. మూడు ఈవెంట్లలోనూ అతడి రేటింగ్ 2599పైనే ఉంది.
గ్రాండ్‌మాస్టర్ టైటిల్ దక్కించుకునేందుకు మూడు జీఎం నార్మ్స్‌ను పొందాల్సి ఉంటుంది. దాంతో పాటు 2500 ఎలో పాయింట్లు సాధించాలి. ఈ టోర్నీలో 2500 ఎలో రేటింగ్ మార్క్‌ను అందుకున్నాడు సంకల్ప్.