భారత మహిళా వెయిట్ లిఫ్టర్ సంజిత చానుపై ఉన్న డోపింగ్ ఆరోపణలను అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్ల్యూఎఫ్) ఉపసంహరించుకుంది. సంజిత శాంపిల్స్‌లో డోపింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటపడలేదని స్పష్టం చేసింది. ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) సిఫార్సు మేరకు ఐడబ్ల్యూఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. 2019లో చాను డోపింగ్ నమూనాలను పరీక్షించిన సాల్ట్ లేక్ సిటీలోని ప్రయోగశాల గుర్తింపునూ తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు వాడా తెలిపింది.
అయితే, ఐడబ్ల్యూఎఫ్ తనకు క్షమాపణ చెప్పాలని, ఇప్పటివరకు అనుభవించిన బాధకు పరిహారం చెల్లించాలని కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత సంజిత డిమాండ్ చేసింది.
ఇప్పటికైనా డోపింగ్ ఆరోపణల నుంచి బయట పడినందుకు సంతోషంగా ఉంది. కానీ, నేను కోల్పోయిన అవకాశాల సంగతేంటి? ఇప్పటివరకు నేను అనుభవించిన మానసిక క్షోభకు, మీరు చేసిన తప్పులన్నింటికీ బాధ్యులెవరు? సంవత్సరాల పాటు ఎటువంటి తీర్పు ఇవ్వకుండా ఒక అథ్లెట్‌ను సస్పెన్షన్‌లో ఉంచారు.
సంజిత చాను, భారత వెయిట్ లిఫ్టర్