Australian open Sania mirza: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భాగంగా నేడు(గురువారం) జరిగిన మిక్స్డ్ డబుల్స్ పోటీల్లో సానియా మీర్జా-రాజీవ్ రామ్(అమెరికా) జోడీ విజయాన్ని అందుకుంది. తొలి రౌండ్లో సెర్బియా ద్వయం అలెక్సంద్రా క్రునిక్(Aleksandra krunic)-నికోలా(nicola cacic)ను వరుస సెట్లలో 6-3, 7-6(3) తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ 69 నిమిషాల పాటు సాగింది. ఈ మ్యాచ్ విజయంలో రామ్ కీలకంగా వ్యవహరించాడు. అతడు 2021లో బార్బొరాతో(Barbora Krejcikova) కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్‌ను దక్కించుకున్నాడు.
సింగిల్స్‌లో తొలి రౌండ్లో నెగ్గిన బ్రిటన్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే నేడు జరిగిన రెండో రౌండ్లో ఓటమి పాలయ్యాడు. 120వ ర్యాంకు టారో డేనియల్(taro daniel) చేతిలో 6-4,6-4,6-4 తేడాతో పరాజయం చెందాదు.