తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెరీర్‌ చివరి మ్యాచ్‌లో సానియాకు నిరాశ.. ఓటమితో వీడ్కోలు - సానియా మీర్జా లేటెస్ట్ న్యూస్

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ చివరి మ్యాచ్​లో నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్​డ్ డబుల్స్​ ఫైనల్​లో సానియా మీర్జా జట్టు ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఆమె తన టెన్నిస్ కెరీర్​కు వీడ్కోలు పలికినట్లయింది.

sania losses australian open mixed doubles final
సానియా మీర్జా

By

Published : Jan 27, 2023, 10:14 AM IST

గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో సానియా మీర్జా- రోహన్‌ బోపన్న జోడీ ఓటమి పాలైంది. ఫైనల్‌ మ్యాచ్‌లో 6-7, 2-6 తేడాతో బ్రెజిల్‌ జంట స్టెఫాని-రఫెల్‌లో చేతిలో ఓడిపోయింది. దీంతో ఓటమితో టెన్నిస్‌ కెరీర్‌కు సానియా వీడ్కోలు పలికినట్లయింది.

2009లో మహేష్‌ భూపతితో కలిసి సానియా తన తొలి గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో ఐదు (మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రెండు, మహిళల డబుల్స్‌లో మూడు) గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు సొంతం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details