తెలంగాణ

telangana

ETV Bharat / sports

సింగపూర్​ ఓపెన్​ క్వార్టర్స్​లోకి సైనా.. రాణించిన అర్జున్​-కపిలా జోడీ - ఎంఆర్​ అర్జున్

Saina nehwal singapore open: స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్​ సింగపూర్​ ఓపెన్​లో రాణిస్తోంది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్​లో గెలుపొందిన సైనా.. క్వార్టర్స్​కు ఎంపికైంది. మరోవైపు పురుషుల డబుల్స్​ విభాగంలో ఎంఆర్​ అర్జున్, ధ్రువ్​ కపిలా జోడీ క్వార్టర్స్​కు దూసుకెళ్లింది.

saina nehwal
సైనా నెహ్వాల్

By

Published : Jul 14, 2022, 4:27 PM IST

Saina nehwal singapore open: ఓలింపిక్స్​ పతక విజేత సైనా నెహ్వాల్​ సింగపూర్​ ఓపెన్​లో అదరగొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్​లో గెలుపొంది క్వార్టర్స్​కు దూసుకెళ్లింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్​లో చైనాకు చెందిన బింగ్​ జావ్​పై 21-19, 11-21, 21-17 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. క్వార్టర్స్​లో జపాన్​కు చెందిన అయా ఒహోరీతో తలపడనుంది. ఇప్పటికే సింధు, ప్రణయ్​లు క్వార్టర్స్​కు ఎంపికయ్యారు.

గత కొంతకాలంగా గాయాలు, ఫామ్​ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సైనా.. స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోతోంది. గత మూడేళ్లలో గతేడాది జరిగిన ఆర్లియన్స్​ మాస్టర్​ సూపర్​ 100 టోర్నీ సెమీస్​లో మాత్రమే​ సైనా మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ఈ ఏప్రిల్​లో జరిగిన కామన్​వెల్త్​ సెలక్షన్​ ట్రయల్స్​కు కూడా సైనా దూరమైన నేపథ్యంలో ఈ టోర్నీ సైనాకు కీలకంగా మారింది. మరోవైపు మెన్స్​ డబుల్స్​లో ఎంఆర్​ అర్జున్​, ధ్రువ్​ కపిలా జోడీ మలేసియాకు చెందిన గోహ్​ జీ ఫై- నుర్​ ఇజుద్దీన్​ ద్వయంపై గెలుపొందింది. ప్రత్యర్థిపై 18-21, 24-22, 21-18 పాయింట్ల తేడాతో విజయం సాధించారు.

ఇదీ చూడండి :కేఎల్​ రాహుల్​తో పెళ్లి.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్​

ABOUT THE AUTHOR

...view details