తెలంగాణ

telangana

ETV Bharat / sports

చీపురు పట్టిన భారత ఛాంపియన్లు

భారత​ ప్రముఖ క్రీడాకారులైన సైనా నెహ్వాల్, మేరీకోమ్​లు, లాక్​డౌన్ పరిస్థితుల వల్ల చీపురు చేతపట్టి శుభ్రం చేస్తూ కనిపించారు. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

By

Published : Mar 30, 2020, 10:01 AM IST

Updated : Mar 30, 2020, 10:31 AM IST

చీపురు పట్టిన భారత ఛాంపియన్లు
సైనా నెహ్వాల్ మేరీ కోమ్

టోర్నీలతో తీరిక లేకుండా.. విజయాలతో సావాసం చేసే మన ఛాంపియన్లు.. కరోనా కారణంగా ఇంట్లోనే ఉన్నారు. దేశమంతా లాక్‌డౌన్‌ ఉండటం వల్ల బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఖాళీ సమయంలో కుటుంబంతో ఆనందంగా గడుపుతూ, ఇంటి పనుల్లో భాగమవుతున్నారు. బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌, బ్యాడ్మింటన్‌ తార సైనా నెహ్వాల్‌.. ఆ బాటలోనే సాగుతూ చీపుర్లు చేతబట్టి ఇంటి పరిసరాలను శుభ్రం చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Last Updated : Mar 30, 2020, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details