Bopanna Ramkumar Pair: తొలిసారి ఏటీపీ టూర్‌లో జట్టు కట్టిన రోహన్ బోపన్న-రామ్‌కుమార్ రామనాథన్ అడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న-రామ్‌కుమార్ 6-2, 6-4తో నాలుగో సీడ్ జంట టామ్‌స్లావ్ (బోస్నియా)-సాంటియాగో (మెక్సికో)కు షాకిచ్చారు. ఆదివారం జరిగే టైటిల్ సమరంలో టాప్‌సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)-మార్సెలో మెలో (బ్రెజిల్)తో బోపన్న జంట అమీతుమీ తేల్చుకోనుంది.
Bopanna Ramkuma Pair: టైటిల్ పోరుకు బోపన్న జోడీ - అడిలైడ్ ఇంటర్నేషన్ టెన్నిస్ టోర్నీ
Bopanna Ramkumar Pair: అడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు దూసుకెళ్లింది రోహన్ బోపన్న-రామ్‌కుమార్ రామనాథన్ జోడీ. ఆదివారం జరిగే టైటిల్ సమరంలో టాప్‌సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)-మార్సెలో మెలో (బ్రెజిల్)తో బోపన్న జంట అమీతుమీ తేల్చుకోనుంది. ఓ ఏటీపీ టోర్నీలో వీరిద్దరూ కలిసి ఆడటం ఇదే తొలిసారి.
Bopanna
ఇవాన్ డోడిగ్‌తో బోపన్న తరుచూ కలిసి ఆడుతుంటాడు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన యుఎస్ ఓపెన్లోనూ ఇవాన్‌తో జతగా బరిలో దిగాడు. ఈ నేపథ్యంలో అడిలైడ్ ఫైనల్లో ఇవాన్‌తో బోపన్న పోరాటం ఆసక్తిని రేపుతోంది. ఇదే వేదికలో జరిగిన మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా సెమీఫైనల్లో ఓడిపోయింది. జనవరి 17న ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు అడిలైడ్ ఈవెంట్‌ను సన్నాహకంగా నిర్వహిస్తున్నారు.