తెలంగాణ

telangana

ETV Bharat / sports

అథ్లెట్ల పోరులో రాజ్యవర్ధన్​దే విజయం - జైపూర్ గ్రామీణంలో గెలిచిన రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్

మోదీ కేబినెట్​లో మంత్రిగా పనిచేసిన రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్.. మరోసారి ఎంపీగా గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన రన్నర్ కృష్ణ పూనియా ప్రత్యర్ధిని ఓడించలేకపోయారు.

అథ్లెట్ల పోరులో రాజ్యవర్ధన్​దే విజయం

By

Published : May 23, 2019, 5:09 PM IST

దేశవ్యాప్తంగా జరిగిన లోక్​సభ ఎన్నికల్లో భాజపాదే హవా. రాజస్థాన్​లోని జైపుర్ గ్రామీణం నుంచి భాజపా తరఫున పోటీ చేసిన రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కృష్ణ పూనియా ప్రజల మద్ధతు సాధించలేకపోయారు. వీరిద్దరూ 2013లోనే రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం.

ఒలింపిక్స్​లో వెండి పతకం సాధించిన రాజ్యవర్ధన్ సింగ్.. భారత సైన్యంలో కల్నల్​గా పనిచేస్తుండేవారు. 2013లో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని భాజపాలో చేరారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా జైపుర్​ గ్రామీణం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సీపీ జోషిపై 3.32 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.

జైపుర్ గ్రామీణంలో అధికంగా ఉండే జాట్ వర్గ ఓటర్లు ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించారు. సాధారణంగా వారు కాంగ్రెస్​కు వ్యతిరేకం కావడం.. రాజ్యవర్ధన్ గెలుపునకు కారణమైంది.

ABOUT THE AUTHOR

...view details