తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా తెలుగమ్మాయి - జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌

జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో (National Boxing Championship 2021) పసిడి కైవసం చేసుకుంది యువ బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen News). ఫైనల్లో 4-1 తేడాతో మీనాక్షి (హరియాణా)పై విజయం సాధించింది.

Nikhat Zareen
నిఖత్ జరీన్

By

Published : Oct 28, 2021, 6:34 AM IST

జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో (National Boxing Championship 2021) తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen News) మరోసారి సత్తాచాటింది. తిరుగులేని పంచ్‌లతో అదరగొట్టి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. హరియాణాలో ముగిసిన ఈ ఛాంపియన్‌షిప్‌ 50-52 కేజీల విభాగంలో ఆమె పసిడి సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో నిఖత్‌, 4-1 తేడాతో మీనాక్షి (హరియాణా)పై విజయం సాధించింది.

టోర్నీ సాంతం నిలకడగా రాణించిన 25 ఏళ్ల నిఖత్‌.. ఫైనల్లోనూ పూర్తి ఆధిపత్యం చలాయించి ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఈ టోర్నీలో స్వర్ణంతో పాటు ఉత్తమ బాక్సర్‌ అవార్డునూ ఆమె సొంతం చేసుకోవడం విశేషం. జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. నేరుగా డిసెంబర్‌ మొదటి వారంలో టర్కీలో జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పోటీ పడేందుకు అర్హత సాధించింది.

ఈ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గిన బాక్సర్లు.. ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో దేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తారని భారత బాక్సింగ్‌ సమాఖ్య ప్రకటించింది. ఈ టోర్నీలో తెలంగాణ అమ్మాయి నిహారిక (60-63 కేజీలు) కాంస్యం దక్కించుకుంది.

ఇదీ చూడండి:నీరజ్​ చోప్రా, మిథాలీ రాజ్​కు ఖేల్​రత్న- ధావన్​కు అర్జున!

ABOUT THE AUTHOR

...view details