స్పెయిన్ బుల్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్కు నిరాశ ఎదురైంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత టాప్-10 ర్యాంకింగ్స్ నుంచి కిందకు పడిపోయాడు. గాయం కారణంగా జనవరి నుంచి ఆటకు దూరమైన అతడు.. క్రమక్రమంగా ర్యాంకింగ్స్‌లో కిందకి పడిపోతూ వచ్చాడు. అయితే తాజాగా.. ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీ ముగిసిన తర్వాత టెన్నిస్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. ఇందులో నాదల్ 13వ స్థానంలో నిలిచాడు. అయితే 2005లో తొలిసారి టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకెళ్లాడు నాదల్. అప్పటినుంచి 18 ఏళ్ల పాటు టాప్-10లోనే కొనసాగుతూ రికార్డు సృష్టించాడు. గతంలోనూ 209 వారాల పాటు, ఐదు సార్లు నెంబర్ వన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. నాదల్ తర్వాత జిమ్మీ కానర్స్ పదిహేనేళ్ల ఏళ్ల పాటు టాప్-10లో నిలిచాడు.
కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే వెనుదిరిగిన నాదల్.. ఆ తర్వాత తుంటి గాయం బారిన పడ్డాడు. అనంతరం గాయం నుంచి నుంచి కోలుకున్న అతడు.. వచ్చే నెలలో జరగనున్న మాంటే కార్లో టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ టోర్నీలో అతడికి మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు 11సార్లు మాంటే కార్లో టైటిల్‌ను ముద్దాడాడు. ఓపెన్ శకంలో 2005 నుంచి 2012 వరకు వరుసగా ఎనిమిది సార్లు టైటిల్‌ను ముద్దాడి రికార్డు సృష్టించాడు. మొత్తంగా నాదల్ కెరీర్లో.. 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను గెలుపొందింది జకోవిచ్‌తో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.