తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెజ్లింగ్​లో ప్రియా మాలిక్​కు స్వర్ణం - ప్రియా మాలిక్​కు స్వర్ణం

రెజ్లర్​ ప్రియా మాలిక్​ పసిడి పతకం దక్కించుకుంది. ప్రత్యర్థి క్సేనియా పటాపోవిచ్​పై.. హంగేరీ వేదికగా జరిగిన ప్రపంచ క్యాడెట్​ ఛాంపియన్​షిప్స్​లో 5-0తో విజయం సాధించింది.

priya malik
ప్రియా మాలిక్

By

Published : Jul 25, 2021, 4:49 PM IST

హంగేరీ వేదికగా జరిగిన ప్రపంచ క్యాడెట్​ ఛాంపియన్​షిప్స్​లో భారత రెజ్లర్​ ప్రియా మాలిక్ సత్తా చాటింది. మహిళల 73 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ప్రత్యర్థి క్సేనియా పటాపోవిచ్​పై 5-0తో విజయం సాధించింది.

టోక్యో ఒలింపిక్స్​లో రజతంతో మీరాబాయి చాను భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించగా.. మరుసటి రోజునే ప్రియా మాలిక్​ గోల్డ్​ మెడల్​తో వార్తల్లో నిలిచింది. 2019లో పూణె వేదికగా జరిగిన ఖేలో ఇండియా పోటీల్లోనూ ప్రియా మాలిక్ సర్ణంతో మెరిసింది. దిల్లీలో జరిగిన 17వ స్కూల్ గేమ్స్​లోనూ బంగారు పతకాన్ని గెలుపొందింది.

ఇదీ చదవండి:Tokyo Olympics: సింధు, మేరీకోమ్ జోష్.. షూటింగ్​లో మళ్లీ నిరాశ

ABOUT THE AUTHOR

...view details