Commonwealth Games PM Modi ఇటీవలే కామన్వెల్త్ క్రీడలు 2022 ఘనంగా ముగిశాయి. అయితే తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల పతక విజేతలకు.. ప్రధాని నరేంద్రమోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. వారిని ఆత్మీయంగా పలకరించారు. ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.
కామన్వెల్త్ పతకవిజేతలు దేశాన్ని గర్వించేలా చేశారని మోదీ ప్రశంసలు
Commonwealth Games PM Modi కామన్వెల్త్ క్రీడల పతకవిజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. వారితో కలిసి ముచ్చటించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు చారిత్రక ప్రదర్శన చేసి దేశం గర్వించేలా చేశారని పేర్కొన్నారు.
"కుటుంబసభ్యుల్లా మీరంతా ఇక్కడి రావడం నాకెంతో సంతోషంగా ఉంది. ముందుగా కామన్వెల్త్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ, మెడల్స్ సాధించినవారికి నా అభినందనలు. చారిత్రక ప్రదర్శన చేశారు. నాతో సహా దేశం మొత్తం గర్వపడేలా చేశారు. ఆత్మవిశ్వాసం, ధైర్యమే మీ గుర్తింపు. మీ కృషి, స్ఫూర్తిదాయక విజయంతో దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లోకి అడుగుపెట్టబోతుంది. గత కొన్ని వారాల ప్రయాణం చూస్తే.. క్రీడల్లో దేశం రెండు భారీ విజయాలను అందుకుంది. ఒకటి కామెన్వెల్త్లో చారిత్రక ప్రదర్శన చేసింది. రెండోది తొలిసారి చెస్ ఒలింపియాడ్ను నిర్వహించింది. చెస్ ఒలింపియాడ్ను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా మంచి ప్రదర్శనను కొనసాగించాం.వారికి కూడా నా అభినందనలు" అని అన్నారు. కాగా, కామన్వెల్త్లో భారత్ నాలుగో స్థానంతో ముగించింది. మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణపతకాలు సహా 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఇదీ చూడండి:దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో ధోనీ బీసీసీఐ అధికారి ఏం చెప్పారంటే