తెలంగాణ

telangana

ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్​: విదేశీ క్రీడాభిమానులకు నో ఎంట్రీ!

ఒలింపిక్స్​ క్రీడలను వీక్షించేందుకు విదేశీయులను అనుమతించకూడదని జపాన్​ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా అనేక దేశాల నుంచి క్రీడాభిమానులను రానివ్వకూడదని ఆ దేశ ప్రభుత్వం భావించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Overseas Spectators To Be Barred From Tokyo Olympics: Reports
టోక్యో ఒలింపిక్స్​: విదేశీ క్రీడాభిమానులకు నో ఎంట్రీ!

By

Published : Mar 9, 2021, 8:51 PM IST

టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు విదేశీయులను అనుమతించకూడదని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా విదేశీ క్రీడాభిమానులను.. రానివ్వకూడదని ఆ దేశ ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు జపాన్‌ ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో చర్చించి ఈ నెలాఖరులోగా తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు వచ్చే విదేశీ క్రీడాభిమానులతో జపాన్‌లో మరోసారి కరోనా విజృంభించే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. భారీ సంఖ్యలో విదేశీయులు జపాన్‌కు పోటెత్తితే కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని.. జపాన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒలింపిక్‌క్రీడలకు విదేశీయులను అనుమతించరాదనే నిర్ణయానికి జపాన్‌ వచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మార్చి 3వ తేదినే టోక్యో మెట్రోపాలిటిన్‌ ప్రభుత్వం అంతర్జాతీయ పారా ఒలింపిక్‌ కమిటీతో సమావేశమై.. నెలఖారులోగా విదేశీ ప్రేక్షకులపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించాయి.

ఇదీ చూడండి:హాకీలో భారత్ అజేయం- బ్రిటన్​పై గెలుపు

ABOUT THE AUTHOR

...view details