మిగతా ఒలింపిక్స్‌కు, ఈ ఒలింపిక్స్‌కు చాలా తేడా ఉంది. కరోనా వల్ల ప్రణాళికల్లో చాలావరకు మార్పులు జరిగాయి. కానీ ఈసారి మాత్రం ఓ విషయం చాలా ఆసక్తి కలిగిస్తోంది.
ఒలింపిక్స్ కోసం ప్రపంచ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులు బస చేసేందుకు 'ఒలింపిక్ విలేజ్'ను(ఒలింపిక్ గ్రామం) నిర్మిస్తుంది ఆతిథ్య దేశం. ఈసారి కూడా టోక్యోలో అలానే నిర్మించారు. కరోనా ప్రభావంతో ఏడాదిపాటు క్రీడలు వాయిదా పడటం వల్ల ఫర్నీచర్‌లో చాలా వరకు మార్పులు చేశారు. అంతకుముందు 200 కిలోల బరువుతో ఉన్న బెడ్లను ఏర్పాటు చేయగా, ఇప్పుడు రీసైక్లింగ్‌కు వీలుండే, తేలికైన బెడ్లను అథ్లెట్ల కోసం అందుబాటులో ఉంచారు. వీటిని 'యాంటీ సెక్స్ బెడ్'గా అని పిలుస్తున్నారు.
శృంగారానికి వీల్లేకుండానే..!
రీసైక్లింగ్ చేసిన పదార్థాలతో తయారుచేసిన ఈ మంచంపై కేవలం ఒక్క అథ్లెట్ మాత్రమే నిద్రపోవడానికి వీలుంటుంది. మరొకరు చేరితే అది విరిగిపోతుంది! దీని వల్ల ఆటగాళ్లు.. శృంగారం, ఇతరత్రా అంశాలు చేయడానికి వీలుపడదు. అలానే క్రీడలు ముగిసిన తర్వాత ఈ మంచాల్ని రీసైక్లింగ్ చేసి పేపర్ ఉత్పత్తుల్ని, దుప్పట్లతో ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని తయారు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.