టోక్యో ఒలింపిక్స్‌లో(neeraj chopra tokyo olympics) స్వర్ణం సాధించిన నీరజ్ చోప్డా మళ్లీ బల్లెం పట్టాడు. ఈ మెగా క్రీడలు(Javelin thrower Chopra) ముగిసిన రెండు నెలల తర్వాత తన శిక్షణను తిరిగి ప్రారంభించాడు. 'మునపటిలాగానే అదే కసితో ఇప్పుడు సిద్ధమవుతున్నా' అంటూ తాను ట్రైనింగ్ చేస్తున్న ఓ త్రో బ్యాక్ ఫొటోను పోస్ట్ చేశాడు. తన కెరీర్లో అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
విశ్రాంతి తీసుకోవడం(Neeraj Chopra latest news) కోసం 2021 సీజన్‌కు సంబంధించిన పోటీలకు దూరంగా ఉంటున్నట్లు ఇటీవల తెలిపిన నీరజ్.. 2022 ఆసియా, కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నద్ధమవుతానని చెప్పాడు.