బెంగళూరులోని సాయ్ కేంద్రంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న రేస్ వాకర్ ఇర్ఫాన్‌తో పాటు మరో నలుగురు ఎలైట్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్స్, నలుగురు సహాయక సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని సాయ్ తెలిపింది. వారందరినీ నిర్బంధంలో ఉంచినట్లు వెల్లడించింది.
సాయ్‌లో కరోనా కలకలం.. మరో ఐదుగురు అథ్లెట్లకు - Olympic-bound race walker Irfan
బెంగళూరులోని సాయ్ కేంద్రంలో ఉన్న రేస్ వాకర్ ఇర్ఫాన్‌తో పాటు మరో నలుగురు అథ్లెట్స్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారు ఐసోలేషన్‌లో ఉన్నట్లు సాయ్ తెలిపింది.
రేస్‌వాకర్ ఇర్ఫాన్
అంతకుముందు మహిళా హాకీ జట్టులోని సభ్యులు సహా పలువురు అథ్లెట్లు కరోనా సోకి కోలుకున్నారు.
ఇదీ చూడండి: హాకీ కెప్టెన్ రాణి రాంపాల్‌తో సహా ఏడుగురికి కరోనా