భారతదేశ అత్యున్నత పురస్కారం ఖేల్‌రత్నకు జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రాను నామినేట్ చేసింది అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ అవార్డు ఇతడు నామినేట్ కావడం వరుసగా ఇది మూడోసారి. ఇంతకుముందు 2018లో జరిగిన కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి, అదే ఏడాది అర్జున్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి, వాటి కోసం ప్రిపేర్ అవుతున్నాడు.
ఖేల్‌రత్నకు స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా - ఖేల్‌రత్నకు స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నామినేట్
జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా పేరును ఖేల్‌రత్నకు సిఫార్సు చేసింది భారత అథ్లెటిక్స్ సమాఖ్య. అర్జున అవార్డు కోసం ద్యుతీ చంద్, అర్పిందర్ సింగ్, మంజిత్ సింగ్, పీయూ చిత్ర పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపింది.
నీరజ్ చోప్రా
ఇతడితో పాటే ఈ ఏడాది అర్జున అవార్డులకు మహిళా రన్నర్ ద్యుతీ చంద్, అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్), మంజిత్ సింగ్(800 మీటర్లు), ఆసియా ఛాంపియన్, మిడిల్ డిస్టెన్స్ రన్నర్ పీయూ చిత్ర పేర్లను నామినేట్ చేశారు.
ఇదీ చూడండి : మేరీకోమ్‌తో వివాదంపై యువ బాక్సర్ నిఖత్ స్పందన